తెలంగాణలో మరో 44 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 12,829 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 31 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న వారు 34 మంది
  • ఇంకా 364 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో 12,829 కరోనా పరీక్షలు నిర్వహించగా, 44 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 31 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 34 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 7,92,191 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,716 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ స్వల్ప పెరుగుదల నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 364 మంది చికిత్స పొందుతున్నారు.

Telangana
Corona Virus
New Cases
Updates

More Telugu News